Nov 17,2023 21:02

సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే

చాపాడు : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మైదుకూరు మండలంలోని వనిపెంటలో నూతనంగా రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వై.ఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకే పాలన అందించాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్‌ రెడ్డి, నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నాగిరెడ్డి , రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌ లాజం , జిల్లా వక్ఫ్‌బోర్డు ప్రెసిడెంట్‌ మదీనా దస్తగిరి, వనిపెంట గ్రామ సర్పంచ్‌ గౌస్‌ లాజం , మండల నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.