Sep 21,2023 21:39

        పెదవేగి:సచివాయల ఉద్యోగులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని జెడ్‌పి చైర్‌పర్సన్‌ గంటాక పద్మశ్రీప్రసాద్‌ సూచించారు. మండలంలోని దుగ్గిరాల గ్రామ సచివాలయాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. వాటిలో కొన్నిలోపాలు గుర్తించి, వాటిని సరిచేసుకుని మరింత సమర్థవంతంగా సేవలందించాలన్నారు. సిఎం జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందచేయాలని సూచించారు.