Aug 03,2023 19:53

సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
అసెంబ్లీ ఎన్నికలకు సచివాలయ సంక్షేమ కార్యదర్శులను బిఎల్‌ఒలుగా నియమించరాదని సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు సుదర్శన్‌, కల్లుబావి రాజు, సహాయ కార్యదర్శి విజరు కుమార్‌, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ కోరారు. గురువారం సిపిఐ ఆధ్వర్యంలో ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంక్షేమ పథకాలు వీరి ద్వారానే లబ్ధిదారులకు అందుతుండడంతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులను నియమించాలని కోరారు.