Apr 16,2023 00:16

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డిఎల్‌డిఒ

ప్రజాశక్తి -కోటవురట్ల:బయోమెట్రిక్‌ వేసి జీతాలు తీసుకునేందుకేనా? అని సచివాలయ సిబ్బంది పనితీరుపై అనకాపల్లి డిఎల్‌డివో మంజుల వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మండల సమావేశం మందిరంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సస్టైనబుల్‌ డెవలప్మెంట్‌ గోల్స్‌ పై నిర్వహిస్తున్న సర్వే వివరాలు పూర్తిస్థాయిలో సిబ్బంది నిర్వహించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి నిర్వహిస్తున్న సర్వే నేటికీ పూర్తి స్థాయిలో చేయకపోవడంపై సర్వేపై మీకు అవగాహన ఉందా లేదా ఉంటే కార్యదర్శులను ప్రశ్నించారు. ఏ ఒక్కరు సరైన సమాధానం చెప్పక పోవడంతో మీరు కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్‌ వేసి జీతాలు తీసుకోవడానికేనా ప్రతి విషయంలోనూ కోటవురట్ల మండలం వెనుకబడి ఉందని అధికారులు ఎవరు చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. అనంతరం ఆమె పలు శాఖల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీ ఇల్లు పనులు ముందుకు సాగక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డిఎల్‌డివో అరుణ శ్రీ, ఎంపీడీవో చంద్రశేఖర్‌, పి ఆర్‌ జె ఈ వర్మ, హౌసింగ్‌ ఇంజనీర్‌ జగదీశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ కరుణ, పలు శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.