Aug 02,2023 16:25

మాట్లాడుతున్న జడ్పిటిసి

సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి
పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి -
 జడ్పిటిసి
ప్రజాశక్తి - కొత్తపల్లి
     గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వీడి పనిచేయని సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పిటిసి సోమల సుధాకర్ రెడ్డి ఎంపీపీ కుసుమలత అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుసుమలత ఆధ్వర్యంలో మండల సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన పలు శాఖల అధికారులతో తమ శాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ పథకాలను వివరించాలని ఎంపీడీవో మేరీ అధికారులకు తెలియజేశారు. అధికారులు తమ శాఖ పరిధిలో ఉన్న పథకాలను వివరించారు. అనంతరం దుద్యాల గ్రామ సర్పంచ్ చందమాల శోభలత మాట్లాడుతూ సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులను కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నారు.  పలు సమస్యల నిమిత్తం సచివాలయాలకు వస్తున్న ప్రజల పట్ల అధికారులు అమర్యాదగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. ప్రజాప్రతినిధులకే పనులు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో వివరించారు. అనంతరం జడ్పీటీసీ ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యల పట్ల స్పందించి పనులు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వీడకపోతే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకొని సమస్యల పట్ల సచివాలయాలకు వస్తున్న ప్రజల పట్ల గౌరవం ఇచ్చి పనులు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ పెద్దన్న ఏపీఎం పుల్లయ్య మండల విద్యాశాఖ అధికారి శ్రీరాములు ఏపీవో రేష్మ వైద్యాధికారులు దీపా నాగవేణి సౌజన్య జుబేదా సర్పంచులు లక్ష్మీదేవి జమీలాబీ సరస్వతి విజయ్ విజయ్ కుమార్ మారెన్న నిత్య లక్ష్మీదేవి బాల ఎల్లయ్య వైస్ ఎంపీపీ 2 జయమ్మ ఎంపీటీసీలు ముబీనా బేగం స్రవంతి శివన్న బాలరాజు కో అప్డేట్ సభ్యులు మహమ్మద్ గౌస్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.