ప్రజాశక్తి - ఆదోని
సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను మెరుగుపరచాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎస్‌కెడి కాలనీ 21వ వార్డు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పథకాలు, అందిస్తున్న సర్వీసు, సచివాలయం నుంచి జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి కోరారు. శివ శంకర్ నగర్‌లోని సాయిబాబా గుడి వద్ద వంకపై కల్వర్టు ఎత్తు పెంచాలని, సచివాలయ భవనం నిర్మించాలని, పురాతన బావి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని విన్నవించారు. కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ ఇంజినీర్ నాగభూషణం రెడ్డి, వార్డు ఇన్‌ఛార్జీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
సచివాలయ పరిసరాలను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్










