Jul 25,2023 00:10

అమరావతి: మండల కేంద్రమైన అమరావతి లోని ప్రధాన రహదారిలో పురాతన గ్రామ కచేరి స్థలంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయ నిర్మాణ పనులను సోమవారం పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు. శంకరరావు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆగిన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే సచివాలయం భవన శంకు స్థాపన కార్యక్రమానికి తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట వైసిపి జిల్లా కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, మండల పార్టీ నాయకులు బి.హను మంతరావు, ఎ.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


2 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి
పెద్దమద్దూరు వద్ద హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సోమవారం పరిశీలించారు. బ్రిడ్జికి కావాల్సిన 5 ప్రధాన పిల్లర్లలో నాల్గింటిని నిర్మించారు. మిగిలిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి రెండు నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ ను ,ఆర్‌ అండ్‌ బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.