సన్మానం చేస్తున్న వైసిపి నాయకులు
ప్రజాశక్తి - నందవరం
ఇంటింటికి వెళ్లి 'జగనన్న నీవే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సచివాలయ కన్వీనర్లకు మండలంలోని పంచాయతీ కార్యాలయంలో సోమవారం సన్మానం చేశారు. దాదాపు 9 మంది కన్వీనర్లను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను, కన్వీనర్లను తీసుకోరావడంతో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మండల కన్వీనర్ శివా రెడ్డి గౌడ్, ముగతి సర్పంచి విరుపాక్షి రెడ్డి, సచివాలయ కన్వీనర్ చాంద్, వైసిపి నాయకులు రమేశప్ప గౌడ్, మీసాల సంపత్ గౌడ్, చాంద్ తాత, మల్లేష్ పాల్గొన్నారు.










