సచివాలయ ఏఎన్ఎం సావిత్రిని వెంటనే సస్పెండ్ చేయాలి
ఆశ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ
ప్రజాశక్తి - నంద్యాల
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయ ఏఎన్ఎం సావిత్రిని వెంటనే సస్పెండ్ చేయాలనికోరుతూ బుధవారం అధ్యక్షులు ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు జి, నాగమణి, జి,రమణకుమారి డి ఎం అండ్ హెచ్ ఓ కు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఆశ వర్కర్ గా విధులు నిర్వహిస్తూ గర్భవతులకు బాలింతలకు ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ఆశా కార్యకర్త నజీర్నిసాను వేధింపులకు గురి చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురించేస్తుందని అన్నారు.ఇబ్బంది పెడుతూ నీవు ఉద్యోగం సాధించుకో డ్యూటీకి రావద్దు నీ స్థానంలో వేరొకరిని ఉద్యోగంలకు తీసుకుంటామని నిత్యం వేధిస్తున్న సచివాలయ ఏఎన్ఎం సావిత్రి వేధింపులకు తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మ అత్యాయత్నానికి పాల్పడిందన్నారు . గతంలో కూడా సచివాలయం సావిత్రి పై స్థానిక డాక్టర్ కు ఫిర్యాదు చేసి భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని చెప్పడం జరిగిందని కానీ సావిత్రి ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మార్పు లేకుండా నిత్యం ఆశా కార్యకర్తలను వేధిస్తూ ఉండడం వల్లే నజురునిస ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు . డిఎంహెచ్వో, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ ఆశ వర్కర్లు సావిత్రి ఆత్మహత్యకు కారకురాలైన ఏఎన్ఎం సావిత్రిని వెంటనే సస్పెండ్ చేసి ఆశా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరారు.










