May 04,2023 23:52

సచివాలయ, ఆర్‌బికె భవనాలను ప్రారంభిస్తున్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు

ప్రజాశక్తి-పెందుర్తి: మండలంలోని వాలిమెరక గ్రామ పంచాయతీలో రూ.62.15 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు అని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి నేరుగా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమలో భగవాన్‌ జయరాం, జెడ్పీటీసీ ఉప్పిలిదేవీకనకరాజు, ఎంపీపీ నాగమణిఅంజి, సర్పంచ్‌ బొడ్డు చంద్ర వాణిప్రకాష్‌, ఎంపీటీసీ సభ్యులు స్వప్న, నక్క కనకరాజు, బిఎన్‌.రాజు, కేసాబోయిన త్రినాధ్‌, నాగార్జున, మాధవరావు, ఎంపిడిఒ వెంకటరమణ, అధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.