ప్రజాశక్తి-ఉక్కునగరం : ఆవిర్భావం నుంచి గడచిన 36ఏళ్లుగా 14,065 సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తూ, రూ.387కోట్ల వార్షిక టర్నోవర్‌తో, ఏటా ఆడిట్ వర్గీకరణలో 'ఏ' గ్రేడ్ సొసైటీగా స్టీల్‌ప్లాంట్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ దూసుకుపోతోందని సొసైటీ ఉపాధ్యక్షుడు కె. ఆనందకుమార్ అన్నారు. స్టీల్‌క్లబ్‌లో నిర్వహించిన 57వ మహాజన సభకు అధ్యక్షతన వహించిన ఆయన మాట్లాడుతూ, సభ్యుల డిపాజిట్స్ త్రిఫ్ట్ ఫండ్‌్, రిటైర్‌మెంట్ ఫండ్స్‌పై 80శాతం మొత్తాన్ని సెక్యూరిటీ లోన్‌గా ఇవ్వడానికి, అలాగే ,సూవర్ యాన్యుయేషన్ బెనిఫిట్ ఫండ్‌గా ప్రస్తుతం నంవత్సరానికి చెల్లిన్తున్న రూ.750లను రూ.850లుగా పెంచి చెల్లించేందుకు పాలకవర్గం చేసిన ప్రతిపాదనలకు నభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. సొసైటీ కార్మదర్శి డి.శ్రీరామచంద్రమూర్తి వార్షిక నివేదికను, కోశాధికారి డివివిఎస్‌ఎస్ కొండరాజు 2023-24 అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా. మహాజన సభ ఆమోదం తెలిపింది డైరక్టర్ ఎమ్‌వి.రమణ బైలా సవరణలను ప్రతిపాదించారు. అంతకుముందు మరణించిన సభ్యులకు డైరెక్టర్ లాలూ భూక్యా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డైరక్టర్ కర్రి శ్రీనివాస్ వందన సమర్పణతో మహాజన సభ ముగిసింది. కార్యక్రమంలో డైరక్టర్లు జివి.రమేష్, విజి.మహీధర్, వివిధ కార్మిక సంఘ నాయకులు, మాజీ పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు, నీనియర్ మేనేజర్ కె.దామోదరరెడ్డి, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.










