Nov 15,2022 00:12

మాట్లాడుతున్న రాజబాబు

ప్రజాశక్తి- భీమునిపట్నం : పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. టిడిపి రాష్ట్ర కమిటీ రూపొందించిన రియల్‌ టైమ్‌ స్టాటజీ (ఆర్‌టిఎస్‌) గ్రూప్‌ ద్వారా పార్టీ విధి, విధానాలతో పాటు వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం చేయాలని శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఆర్‌టిఎస్‌ బృంద సభ్యులు పి.జాన్‌, ఎ.మహేష్‌, వి.చైతన్య, వెంకటశ్యామ్‌ సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె లీలావతి, పిల్ల వెంకటరావు, బడిగింటి నీలకంఠం, ఎస్‌.గణేష్‌రెడ్డి, పతివాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.