Mar 29,2023 01:15
మహిళా రైతుల సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-అద్దంకి: రైతులకు సబ్సిడీతో కూడిన రుణాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తామని ఏపిఎం సిహెచ్‌ కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక మండల సమైక్య కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపిఎం కోటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా మహిళలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాలను మహిళా రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులను పాటిస్తూ గిట్టుబాటు ధరలు ఉండే విధంగా ఎఫ్‌పిజిలు ఉండాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మంచి పద్ధతులు అవలంబిస్తూ దిగుబడి పొందే విధంగా మహిళా రైతులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పిఓ పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐదుగురు మహిళా రైతులను డైరెక్టర్లుగా ఎంపిక చేశారు. సీసీలు ఎఫ్‌పిజిలు లీడర్లు పాల్గొన్నారు.