ప్రజాశక్తి-కొండపి : ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులందరికీ ధ్రువీకరణ పత్రాలు అందచేయాల్సిన బాధ్యత రైతు భరోసా కేంద్ర సిబ్బందిపై ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు.కొండపి-1 రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ చేశారు. అదే విధంగా ఖరీఫ్-2023లో ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎఒ డి.విజయకుమార్, కొండపి -1 విఎఎ వెంకట నారాయణ, విఎఎబి చైర్మన్ ఆరికట్ల హరినారాయణ, గొట్టిపాటి మురళి,రైతులు పాల్గొన్నారు