Jul 19,2023 22:49

బియ్యం ప్యాకెట్‌ను అందజేస్తున్న స్పీకర్‌ సీతారాం

- శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస : 
ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలోని రైతుబజార్‌లో ప్రభుత్వ రాయితీతో కూడిన సన్న బియ్యం కేంద్రాన్ని బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వస్తు ఉత్పత్తి తగ్గినప్పుడు డిమాండ్‌ క్రమంగా పెరుగుతుందన్నారు. దీనివల్ల సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇటువంటి సమయంలో అటువంటి నిత్యావసర సరుకులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సబ్సిడీపై అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బియ్యం, టమాటా అధిక ధరలు పలుకుతున్నాయన్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే సన్నబియ్యం కిలో రూ.48, సాధారణ బియ్యం కిలో రూ.35కు ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో డిఎస్‌ఒ వెంకటరమణ, తహశీల్దార్‌ గణపతి, మార్కెటింగ్‌శాఖ ఎడి ఎం.కాళేశ్వరరావు, మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, సచివాలయాల కోఆర్డినేటర్‌ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్యామ్‌ప్రసాద్‌, దుంపల శ్యామలరావు, రైతుబజారు ఇఒ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.