దుండగులు కట్ చేసిన పైపు (సర్కిల్‌లో ఉన్నది)
ప్రజాశక్తి- చింతూరు
చింతూరు మండల కేంద్రంలోని శబరినది వంతెనపై తాగునీటికి ఏర్పాటు చేసిన ఇనుప పైపులైను ఎత్తుకెళ్లిందుకు గుర్తు తెలియని దుండగులు కట్ చేశారు. గతంలో ఇదే తరహాలో శబరి నది ఇంటెక్ వెల్ నుండి మోటారు కేబుల్ వైర్లు కూడా అనేకసార్లు దొంగతనానికి గురయ్యాయి. దీంతో నాడు చెట్టి చింతూరు వాసులకు తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా తాగునీటి పైపులైన్‌పైనే దొంగల దృష్టి పడింది. దానిని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా బలమైన పైపులను అక్కడక్కడా కట్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తాగునీటి పైపులైన్లు అహరణకు గురికాకుండా చూడాలని, పైపులైన్ కట్ చేసిన వారిని పట్టుకోవాలని మండల కేంద్రం వాసులు కోరుతున్నారు.










