
ప్రజాశక్తి-రోలుగుంట:ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ చట్టం అమలు చేసి, నిధులు ఖర్చు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని పోరాడి సాధించుకున్నారని, ఆ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అభివృద్ధి చేయాలన్నారు. సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వారికి కేటాయించిన నిధులను ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు, ఇతర పథకాలు ఏమీ అమలు కాలేదన్నారు. పేరుకు మాత్రం ఎస్సీ కార్పొరేషన్ ఉన్నాయని, వాటికి చైర్మన్లు ఉన్నారని ఎవరికి కూడా ఉపాధి లభించ లేదన్నారు. భవిష్యత్తులో దళితుల సమస్యలపై కార్పొరేషన్ సంక్షేమ పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.