May 17,2023 22:12

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌

- పెద్దమల్లాపురం కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌
ప్రజాశక్తి - రౌతులపూడి
రౌతులపూడి మండలంలోని రాఘవపట్నం పంచాయతీ మాతీయపేట, కొత్తూరు, ముకులూరు, ఎస్‌.పైడిపాల గ్రామాల్లో గిరిజనులతో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్‌ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ గతంలో రంపచోడవరం ఐటిడిఎ ద్వారా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రస్తుతం గిరిజన ప్రాంతం మైదాన ప్రాంతంలో కలిసి ఉండడం వలన అభివృద్ధికి దూరంగా గిరిజన గ్రామాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రంపచోడవరం ఐటిడిఎ, శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి మండల అధికారులను అడిగిన సమాచారం మేరకు, మిగిలిన గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చేడానికి ఉద్యమం చేయడానికి సిద్దపడాలని పిలుపు నిచ్చారు. సమావేశాల్లో పి.వర హాలు, జర్త ముసలయ్య, ముర్ల దొంగబ్బాయి, తారాకేష్‌, నూక రాజు, సత్యనారాయణ, కె.రాజబాబు, రాంబాబు పాల్గొన్నారు.