అయ్యో....
ముగిసిపోయింది
మరో అబల జీవిత ప్రస్థానం
మదమెక్కిన మగజాతి
విష కర్కశ కోరలతో
విరుచుకుపడితే
చిగురుటాకులా వణికింది
అభాగిని
కసిబూసిన కర్కోటకులు
మరో నెత్తురు మరకను
మీసాలకు పులుముకున్నారు
పన్నీరులా...
ఓ తరుణీ !
కష్టాన్ని పదుగురితో పంచుకో
'స్తబ్దత' శిశిర ఆకులు రాల్చుకొని
'శ్వాసల్లో' చైతన్యం నింపుకొని
'దిశా' నిర్దేశం చేసుకో...
దౌర్జన్యాన్ని దండించు
దుర్మార్గాన్ని దహించే
జ్వాలగా మారు
నీకు నీవే రక్షణ కల్పించుకో
నీ చరిత్ర నీవే తిరగరాసుకో !
వేమూరి శ్రీనివాస్
99121 28967