రామాపురం : ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన రామాపురంలో రూ.18 లక్షల ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో ఆర్‌టిసి బస్‌షెల్టర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రమైన రామాపురంలో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్న దష్ట్యా ప్రయాణీకులు, ప్రజలు కోరిక మేరకు బస్‌షెల్టర్‌ను నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. బస్‌షెల్టర్‌లో ప్రయాణీకులు సౌకర్యవంతంగా టాయిలెట్లును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి గడికోట జనార్దన్‌రెడ్డి, జడ్‌పిటిసి మాసన వెంకట రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపువిశ్వనాధరెడ్డి, వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, సింగల్‌విండో అధ్యక్షులు పెద్దిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సర్పంచ్‌లు నాగ భూషన్‌రెడ్డి, పలవలి వెంకటరెడ్డి, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరం వెంకటసుబ్బారెడ్డి, సత్యయాదవ్ పాల్గొన్నారు.