Sep 03,2023 18:15

టిటిడి సభ్యులుగా శేషుబాబు ప్రమాణస్వీకారం
ప్రజాశక్తి - పాలకొల్లు
టిటిడి సభ్యులుగా మేకా శేషుబాబు ఆదివారం తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ యాత్రికుల మనోభావాలకు అనుగుణంగా తిరుమలలో సౌకర్యాల మెరుగుదలకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. టిటిడి కళ్యాణ మండపాల నిర్మాణం, నిర్వహణ మెరుగుదలకు కృషి చేస్తానని చెప్పారు. శేషుబాబు తల్లిదండ్రులు, మేకా కోటేశ్వరరావు, సోదరుడు, ఆగర్రు సొసైటీ అధ్యక్షులు మేకా రామకృష్ణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.