Feb 25,2023 01:57
బహుమతి అందుకుంటున్న విద్యార్థి

ప్రజాశక్తి-అద్దంకి: బాపట్లలోని బాపట్ల పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అద్దంకి మండల స్థాయిలో ఐదు సబ్‌ థీమ్స్‌ నిర్వహించారు. వీటిలో తిమ్మాయపాలెం జడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కెవి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రదర్శనలో 9వ తరగతి విద్యార్థి షేక్‌ మహమ్మద్‌ కుర్షిద్‌ అఫ్జల్‌ ప్రదర్శించిన ఫీజు ఎలక్ట్రిసిటీ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ విద్యార్థికి గైడ్‌ టీచర్‌గా పిఎస్‌ ఉపాధ్యాయులు ఎస్‌జె శ్రీనివాసరావు వ్యవహరించారు. మరో 9వ తరగతి విద్యార్థి పార్థి సాయి ప్రదర్శించిన మై మదర్స్‌ హెల్తీ కిచెన్‌ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఏ ధనలక్ష్మి గైడ్‌ టీచర్‌గా వ్యవహరించారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు కెవి శ్రీనివాసరావు, సైన్సు ఉపాధ్యాయులు జి సునోద్‌ కుమార్‌, పి బాబురావు, పి విజయలక్ష్మి, ప్రమీలారాణి, కమిటీ చైర్మన్‌ అభినందించారు. ఈ మెరిట్‌లో 10వ తరగతిలో ద్వితీయ స్థానంలో నిలిచిన వై ప్రణీత్‌ 7వ తరగతిలో ద్వితీయ స్థానంలో నిలిచిన రామ్‌ చరణ్‌లను కూడా అభినందించారు.