
ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కొండపల్లి పట్టణ జన విజ్ఞాన వేదిక కమిటీ సమావేశం గురువారం డాక్టర్ మోహన్ రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నందు జెవివి కొండపల్లి శాఖ అధ్యక్షులు ఎస్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం చెకుముకి సైన్స్ సంబరాలు 2023 గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్‌రావు హాస్పిటల్ డాక్టర్ మామిడి శీతారామారావు, ఎన్టీఆర్ జిల్లా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు వెనిగళ్ళ మురళీమోహన్, ఉపాధ్యక్షులు పట్ల కామేశ్వరరావు, కొండపల్లి ప్రధాన కార్యదర్శి ఎస్కే సర్దార్ సాహెబ్, కార్యదర్శి బి డేవిడ్‌రాజ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి పోటీలు నవంబర్ 10న, మండల స్థాయి పోటీలు నవంబర్ 30న, జిల్లాస్థాయి పోటీలు డిసెంబర్ 17న, రాష్ట్రస్థాయి పోటీలు జనవరి 27, 28 తేదీల్లో జరుగుతాయని తెలిపారు. పాఠశాల స్థాయిలో ఎంపికైన జట్లు నవంబర్ 30న మండలస్థాయిలో ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాలలో జరిగే పోటీలలో పాల్గొంటాయని తెలిపారు.