
సైన్స్ ఫేర్ ప్రారంభం
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
రీజినల్ సైన్స్ సెంటర్, తిరుపతి బాలోత్సవం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైన్స్‌ఫేర్‌ను టిటిడి డిప్యూటీ ఈఈ దేవేందర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. స్థానిక సైన్స్ రీజినల్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సజనాత్మకను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అన్నారు. పిల్లల్లో సైన్స్ పరంగా మరింత నైపుణ్యతను తీసుకొచ్చేందుకు కషి చేయాలని సూచించారు. తిరుపతి బాలోత్సవం కార్యదర్శి మల్లారపు నాగర్జున మాట్లాడుతూ తిరుపతి బాలోత్సవాన్ని రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశామన్నారు. అప్పట్నుంచి అనేక ప్రభుత్వ ప్రైవేట్ తిరుపతి మున్సిపల్ స్కూళ్లలో విద్యార్థులకు అతి దగ్గర బంధువయామని గుర్తు చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు చదువుల్లో తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. మానస వికాసం తగ్గుతుందని తెలిపారు. వాటి నుంచి పిల్లల్ని బయటపడేసేందుకు ఆటపాట మాట తదితర కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసాన్ని కలిగించాలన్నదే బాలోత్సవం లక్ష్యం అన్నారు. ఇందుకు కషి చేస్తున్న తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ సైన్ సెంటర్ నిర్వాహకులకు కతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్లో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో పెద్ద ఎత్తున బాలోత్సవం నిర్వహిస్తున్నామని, ఇందులో విద్యార్థులు బాలలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బాలోత్సవం అధ్యక్షులు టెంకాయల దామోదరం మాట్లాడుతూ పాఠ్యాంశాల్లో ఉన్న విజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకుని, ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులుగా ఎదిగేందుకు కషి చేయాలన్నారు. శాస్త్రీయతపై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువుల పై ఉందని, మూఢనమ్మకాలను పారదోలాలని సూచించారు. ఈ సందర్భంగా పిల్లలు తయారు చేసిన పలు అంశాలను ప్రదర్శన ఉంచారు. అనంతరం పిల్లలచే సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సైన్స్ ఫేర్ 17, 18 తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నెహ్రు, పలు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు జరగనున్న సైన్స్‌ఫేర్‌ను ప్రారంభిస్తూ...