Mar 01,2023 23:31

సైన్సు ప్రాజెక్టులను పరిశీలిస్తున్న వెంకటేశ్వరావు

ప్రేజాశక్తి -చీరాల : సైన్స్‌ ప్రయోగాలతో విద్యా ర్థులకు మంచి మేధస్సు లభిస్తుందని గౌతమి విద్యాసంస్థల అధినేత ఎం. వెంకటేశ్వర రావు తెలిపారు. మండల పరిధిలోని ఈపూరుపాలెం తేజ స్కూల్‌లో వైజ్ఞానిక ప్రదర్శనను బుధవారం నిర్వహించారు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు సైన్సుప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో కీర్తి వెంకటరావు, ఉపాధ్యాయులు సారు ుకుమార్‌, విజయేశ్వరి, పాల్గొన్నారు. మేదరమెట్ల : సైన్స్‌ డే సందర్భంగా మేదరమెట్లలోని సెయింట్‌ అర్నాల్డ్స్‌, సెయింట్‌ జోసెఫ్‌ అద్దంకి, మేదరమెట్ల స్కూల్‌లో బుధవారం సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. సైన్సు ఎగ్జిబిషన్‌ను ఎఎస్‌ఐ మాహ్మద్‌,కె.స్టాలిన్‌ ,అనిల్‌కుమార్‌ సందర్శించారు. అనంతరం వారు విద్యా ర్థులతో మాట్లాడుతూ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఆసరాగా చేసుకుని ఒక్క విద్యార్థి అయినా సైంటిస్ట్‌గా ఎదిగితే అది దేశానికి గర్వ కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్‌ ఆర్నాల్డ్స్‌ స్కూల్‌ ప్రధానోపా ధ్యాయుడు, కరస్పాండెంట్‌ ఫాదర్‌ ఆరోగ్య దాస్‌ ,ఫాదర్‌ రాజశేఖర్‌, ఫాదర్‌ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.