ప్రజాశక్తి -కరప కరప నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని లీలా మనోహర్ తెలిపారు. మానసిక వైకల్యం కలిగిన పిల్లలు పుట్టుక కారణాలు పరిష్కారం అనే ప్రాజెక్టుతో కాకినాడ జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలలో కరప విద్యార్థులు తొమ్మిదవ తరగతి చదువుతున్న కె.యశస్విని విజయదుర్గ, రమ్యశ్రీ రత్నమణి జన్యుపరమైన కారణాలు, పౌష్టికాహారపరమైన, వ్యాక్సిన్ పరమైన, బాల్య వివాహం వంటి పలు అంశాలను ఈ ప్రాజెక్టులో వివరించారన్నారు. జిల్లావ్యాప్తంగా 260 ప్రాజెక్టులు రాగా ఉత్తమ ప్రాజెక్టుగా కరప విద్యార్థులు ముందంజలో నిలిచారు. ప్రాజెక్టుకు గైడ్ టీచరుగా వ్యవహరించిన మడికి సుదర్శన బాబును జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా సైన్స్ అధికారి వినీల్, సైన్స్ కాంగ్రెస్ కన్వీనర్ కేసరి శ్రీనివాస్, సర్పంచ్ ఎస్.ఆశాజ్యోతి, జెడ్‌పిటిసి వై.సుబ్బారావు, ఎంపిపి శ్రీలక్ష్మి అభినందించారు.