ప్రజాశక్తి - ఆదోని
సైన్స్ ఆవిష్కరణలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని డిఇఒ డాక్టర్ రంగారెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హిరోషిమా, నాగసాకి దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అణ్వయుధాల విస్ఫోటనంతో భూమికి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిరోషిమా, నాగసాకి యుద్ధం జరిగినప్పుడు అణుబాంబుల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సైన్స్ మంచి ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. యుద్ధాన్ని కోరుకోకూడదని, ప్రపంచ శాంతిని కోరాలని తెలిపారు. 'సైన్స్‌ను సమాజ శ్రేయస్సుకు వినియోగిస్తామని, యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు' అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎపి శాస్త్ర, సాంకేతిక మండలి జిల్లా కోఆర్డినేటర్ రంగమ్మ, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున, సైన్స్ ఉపాధ్యాయులు రవి, నాగరాజు, గిరిబాబు, సతీష్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డిఇఒ రంగారెడ్డి










