Sep 15,2023 00:36

ప్రజాశక్తి - చీరాల
రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టిడిపి ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ కొత్తపేటలోని టిడిపి కార్యాలయంలో రిలే దీక్షలు గురువారంకు 3వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరంలో టిడిపి యువనేత అమర్, నాసిక వీరభద్రయ్య, గజవల్లి శ్రీనివాసరావు, తేలప్రోలు నాగేశ్వరరావు, కుంచాల రామాంజనేయులు, కౌతరపు జనార్దనరావు, షేక్ కరీముల్లా, నజీర్ దూదేకుల, షేక్ రజాక్, షేక్ గౌస్, యర్రా శివ మల్లేశ్వరి, పాకల పాండు, కౌతరపు నాగేశ్వరి, లావేటి శ్రీనివాస్ తేజ, పులిపాటి శేఖర్, ఎస్‌కె లాల్ అహ్మద్, బుర్ల రోశయ్య పాల్గొన్నారు.