Oct 24,2023 20:38

సైకో పాలనకు ముగింపు పలుకుదాం: టిడిపి

కలికిరి :సైకో పాలనకు ముగింపు పలుకుదామని టిడిపి మండల అధ్యక్షుడు నిజాముద్దీన్‌ అన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కలికిరి టిడిపి కార్యాలయం అమ ర్నాథ్‌రెడ్డి భవనంలో మండల అధ్యక్షుడు నిజాముద్దీన్‌ ఆధ్వర్యంలో నాయ కులు కార్యకర్తలు సైకో పోవాలి సైకిల్‌రావాలి అంటూ నినా దాలు చేస్తూ సైకో పోవాలి కరపత్రాలను మంట ల్లో కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధిని గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబును అక్రమంగా అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. కార్యక్ర మంలో మండల ఉపాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, కలికిరి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రెడ్డివారి ప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మాలతి, మాజీ సర్పంచ్‌ అంజమ్మ, మాజీ ఎంపిటిసి జనార్దన్‌ గౌడ్‌ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తున్న సైకో జగన్‌ పోవాలని అక్రమంగా అరెస్టు చేయబడిన చంద్రబాబు నాయుడు బయటకు రావాలని మాజీ మార్కెట్‌ చైర్మన్‌ కాలాడీ ప్రభాకర్‌ రెడ్డి టిడిపి నాయకుడు ఆర్‌.నాగేంద్రరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌ ఆవరణంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రవిశంకర్‌ రడ్డి, రెడ్డప్పరెడ్డి, అజంతుల్లా ఇస్మాయిల్‌, అమీర్‌, వాసు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌: వైసిపి పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతు న్నారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు షాజహాన్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి బెంగళూరు బస్టాండులోని టిడిపి కార్యాలయం ఎదుట పార్టీ నాయకులతో కలిసి సైకో పోవాలి కరపత్రాలను దహనం చేసి,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో జునైద్‌అక్బరీ, నాగూర్‌వలి, షంషీర్‌ నాదెండ్ల విద్యాసాగర్‌, బాలుస్వామి, గిరీష్‌ కుమార్‌, బాలమాలిశేఖర్‌, నాగమణి, హసీనా టిడిపి నాయకులు పాల్గొన్నారు. ములకలచెరువు : రాష్ట్రంలో వైసిపి పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మండల టిడిపి అధ్యక్షులు పాలగిరి సిద్ధ పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సైకో పాలన పోవాలి జగనాసుర కరపత్రాలను దహనం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండి త్వరగా బెయిల్‌పై బయటకు వస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నాయకులు, శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రామానుజులు, కేవీ. రమణ, చెన్నకష్ణ చింతకుంట్ల కేశవ, మౌల, వెంకటస్వామి, కాల మహేష్‌, విజరు కుమార్‌, గాండ్ల రెడ్డెప్ప చాంద్‌ బాషా, బుర్రరమణ, శంకర్నా రాయణ, నారాయణస్వామి నాయుడు, సుబ్బు నాయుడు, రమణారెడ్డి, శామీర్‌, రవి, శ్రీనివాసులు, శ్రీనివాసులు, నాగేంద్ర, మధు, ఉమాశంకర్‌, నారాయణ, ప్రతాప్‌, ఆది, బసవి శ్రీనివాసులు, బసవి చంద్ర, తంబళ్ల శివన్న, విజరు కుమార్‌, రెడ్డప్ప, చెన్నకేశవులు పాల్గొన్నారు. కలికిరి : సైకో పోవాలి కరపత్రాలను దహనం చేస్తున్న టిడిపి నాయకులు