Oct 01,2023 21:40

వేపాడ.. దీక్షా శిబిరంలో కూర్చున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, వేపాడ మండల నాయకులు

ప్రజాశక్తి-విజయనగరంకోట :  రాష్ట్రంలో సైకో పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆదివారం 'బాబుతో నేను' కార్యక్రమంలో భాగంగా గంటస్తంభం వద్ద చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు,వాహన దారులతో పోస్ట్‌ కార్డులపై సంతకాల సేకరణ చేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విజయనగరం నియోజకవర్గ టిడిపి నాయకులు ఆధ్వర్యంలో స్థానిక అశోక్‌ బంగ్లా వద్ద నిరసన దీక్షలు ఆదివారం కొనసాగాయి. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
బొబ్బిలి : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బొబ్బిలిలో 19వ రోజు ఆదివారం రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలను టిడిపి సీనియర్‌ నాయకులు రౌతు రామమూర్తి, సుంకరి సాయిరమేష్‌ ప్రారంభించారు. దీక్షలలో చిరు వ్యాపారులు కూర్చుని మద్దతు ప్రకటించారు.
వేపాడ : శృంగవరపుకోట పట్టణంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం దీక్షల్లో టిడిపి వేపాడ మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి భారతి, నాయకులు గొంప తేజ, కండిపల్లి ఈశ్వరమ్మ, కండిపల్లి అచ్చియమ్మ, తదితరులు కూర్చున్నారు. కార్యక్రమంలో నాయకులు ఇందుకూరు శ్రీనివాసరాజు, బంగారునాయుడు, జి.రమణ, గొర్లె నాగరాజు, బానాది ఎంపిటిసి గొంప తులసి, సేనాపతి గణేష్‌ సిరికి రమణ పాల్గొన్నారు.
నెల్లిమర్ల : నెల్లిమర్లలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర్‌ రావు, సువ్వాడ రవి శేఖర్‌, కడగల ఆనంద్‌ కుమార్‌, గేదెల రాజారావు, కర్రోతు సత్యనారాయణ, పతివాడ అప్పల నారాయణ, పోతల రాజప్పన్న తదితరులు పాల్గొన్నారు.

డెంకాడ.. నాతవలసలో దీక్షలు చేస్తున్న టిడిపి సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర్‌రావు, నాయకులు, కార్యకర్తలు
డెంకాడ.. నాతవలసలో దీక్షలు చేస్తున్న టిడిపి సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర్‌రావు, నాయకులు, కార్యకర్తలు


డెంకాడ : చంద్రబాబును విడుదల చేయాలని టిడిపి ఆధ్వర్యాన నాతవలసలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖరరావు, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, పూసపాటిరేగ మండల అధ్యక్షులు మహంతి శంకర్రావు, కలిదిండి పాణీరాజు, పి.శివరామ విద్యాసాగర్‌ నాయుడు, కాగితాల సత్యనారాయణ రెడ్డి, కొర్నాన ఆదిబాబు, కొయనేని రమణ, నాతవలస సర్పంచ్‌ ఆవాల లక్ష్మి పాల్గొన్నారు.
గరివిడి : చీపురుపల్లిలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున ఆధ్వర్యాన చేపట్టిన దీక్షల్లో ఆదివారం గరివిడి మండలం తోండ్రంగి గ్రామ నాయకులు బలగం వెంకటరావు ఆధ్వర్యంలో నలుపు దుస్తులు ధరించి కూర్చున్నారు. కార్యక్రమంలో రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్‌ బాబు, సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం : మండలంలోని పోలిపల్లి గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టు అక్రమమని కరపత్రాలను పంపిణీ చేశారు. టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, నాయకులు కర్రోతు రాజు, చింతపల్లి రామకృష్ణ, రామునాయుడు, సిరగం శ్రీను, విజరు, ఆనంద్‌, మామిడి బాలకృష్ణ, చందక శ్రీను, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.