Aug 10,2023 20:59

వీరఘట్టం రోడ్డుషోలో పాల్గొన్న చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి-పాలకొండ/వీరఘట్టం :  రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుందని, అందరూ కలిసి చరమగీతం పాడాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం పార్వతీపురం మీదుగా ప్రజాభేరి యాత్రలో భాగంగా వస్తుండగా కార్గిల్‌ పాయింట్‌ వద్ద కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆయన వాహనం దగ్గరకు వెళ్లి జై సిఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడ ఉన్న వారినుద్ధేశించి వారు మాట్లాడుతూ సిఎం పదవి తనకు కొత్తేమికాదని, రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్‌రెడ్డిని అందరూ వ్యతిరేకించాలన్నారు. పాలకొండ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, మరలా తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
మద్యం ద్వారా వచ్చే డబ్బులు ఏమవుతున్నాయి
పక్క రాష్ట్రం నుంచి మద్యం సరఫరా అవుతుందని, వాటికి సంబంధించి డబ్బులు ఏమవుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా రోడ్డుషో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సైకో పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టిడిపికి అందరూ అండగా నిలవాలని, రాబోయే రోజుల్లో టిడిపికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు, పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, సీనియర్‌ నాయకులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, పొన్నాడ నాగేశ్వరరావు, గొర్లె హరిబాబు, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, మండల యువత అధ్యక్షులు మాచర్ల అనీల్‌, బల్లా హరిబాబు, తూముల రమేష్‌, చింతా ఉమామహేశ్వరరావు, పి.మహేష్‌, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.