
ప్రజాశక్తి, దర్శి : టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి ఎస్‌సిసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు చేపట్టిన ప్రజా స్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అఖిల్ కోరారు. స్థానిక కార్యాలయంలో టిడిపి మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఎస్‌సి సెల్ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు ఎత్తి వేసే వరకూ ఎస్‌సిలందరూ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్, నాయకులు గర్నెపూడి స్టీవెన్, తాతపూడి తెల్లయ్య, పరిశుధ్దరావు, నెహేమియా, రత్తయ్య, నాగేశ్వరరావు, దామా కృష్ణ పాల్గొన్నారు.