ప్రజాశక్తి - ఆదోని
సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని రోటరీ క్లబ్ సభ్యులు బసవరాజు, విట్టా రాజేష్, శివరాం తెలిపారు. శనివారం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా రోటరీ, ఆదోని సైక్లింగ్, మహిళా సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రోజూ వ్యాయామంలో సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వ్యాయామం లేకపోవడం వల్ల శారీరకపరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఉల్లాసం, మనస్సుకు ప్రశాంతత ఉంటుందని సైక్లిస్టులు పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్యూరెన్స్ వారి సహాయ, సహకారంతో రేస్‌లో పాల్గొన్న వారికి చల్లని పానీయాలు స్పాన్సర్ చేశారు. ప్రతేడాది జూన్ 3న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి ఎమ్మిగనూరు రోడ్డు బైచిగేరి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యోగా గ్రూపు మహిళలు అనురాధ, సుజాత, రుక్మిణి, విట్టా శ్రావణి, వినీత, చిన్నారులు పాల్గొన్నారు.
సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న సభ్యులు










