Oct 22,2023 00:16

కాగ్నిటివ్‌ డిజిటల్‌ థెరపీ కేంద్రం ప్రారంభంలో వీసీ ప్రసాదరెడ్డి

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయం సైకాలజీ విభాగంలో అధునాతన కాగ్నిటివ్‌ డిజిటల్‌ థెరఫీ కేంద్రాన్ని వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. కేంద్రం ప్రత్యేకతలను, ప్రజలకు, విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెస్ట్‌ రూమ్‌ను విద్యార్థినితో ప్రారంభింపజేశారు. అనంతరం విభాగాలో ప్రయోగశాలను తనిఖీ చేశారు. అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. తరగతి గదులు, సమావేశ మందిరం, ప్రయోగశాలలు ఆధునీకరించిన విధానాన్ని గమనించి, పలు సూచనలు చేశారు.
విభాగాధిపతి ఆచార్య ఎంవిఆర్‌.రాజు మాట్లాడుతూ, వ్యక్తిలో మానసిక సమస్యను, డిప్రెషన్‌, ఒత్తిడి స్థాయిలు, ఏంగ్జయిటీ, ఎమోషన్స్‌ వంటివి కాగ్నిటివ్‌ డిజిటల్‌ థెరఫీ సహాయంతో గుర్తించడం సాధ్యపడుతుందన్నారు. వీటితో పాటు విభాగంలో ఆల్కహాల్‌ ఎవర్షన్‌ థెరఫి (మధ్యం మాన్సించే విధానం), న్యూరో ఫిజిలాజికల్‌ ల్యాబ్‌కు పనిచేస్తున్న విధానాలను వివరించారు. కార్యక్రమంలో సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.