Oct 01,2023 00:59

సత్తెనపల్లి: పట్టణంలోని 20వ వార్డులో మురుగునీరు ఇళ్ళ ముందుకు చేరుతున్న కారణంగా దుర్వాసన భరించలేక పోతున్నామని, సైడ్‌ కాల్వలను శుభ్రం చేయించాలని స్థానికులు వాపోయారు. 20వ వార్డు ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.షమ్మీ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల మాట్లాడుతూ ఆ వార్డులో రుషి గుడి బజారులో విట్రా నాగేశ్వరరావు ఇంటి వద్ద నుండి చిన్నం శ్రీనివాసరావు ఇంటి వరకు సైడ్‌ కాల్వలు శుభ్రం చేయకపోవడంతో మురుగు నీటితో నిండిపోయాయని, దుర్వాసన భరించలేకపోతున్నామని అన్నారు. ఈ విషయాన్ని గతంలో అనేకసార్లు మున్సిపల్‌ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదదని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి మురుగు కాలువలు శుభ్రం చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు ఎం శివ, కె ఈశ్వరమ్మ,సిహెచ్‌ అరుణ సిహెచ్‌ వాసవి టి వెంకయ్యమ్మ ,చిన్నం వెంకట నరసమ్మ,ఎం శివ పార్వతి,పి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.