Sep 21,2023 00:02

ప్రజాశక్తి - పంగులూరు
గత కొంతకాలంగా గ్రామలో పంచాయతీ అధికారులు పారిశుధ్య పనులు చేయించలేదు. దీంతో దళిత కాలనీలో సైడ్ కాలువలు మురుగుతో నిండిపోయాయి. రోడ్లకిరువైపులా పిచ్చి మొక్కలు మొలిచాయి. దోమలు, ఈగలు చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పంగులూరు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు బుధవారం దళిత కాలనీల్లోని సైడ్ కాలవలో మురుగు తీశారు. కాలువ పక్కనున్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం వలన సమస్య ఎదురు కాలేదు. కానీ వర్షాలు కురుస్తున్నట్లయితే మురుగంత రోడ్ల మీదకు వచ్చేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో సీజనల్ వ్యాధులు కూడా ఉన్నందువల్ల పిచ్చి మొక్కలను తొలగించి మురుగును తొలగించటం మంచి పని అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుడిపూడి నాగేంద్రమ్మ రామారావు, సెక్రెటరీ ఎల్‌ సునీతకు అభినందనలు తెలిపారు.