Nov 20,2022 00:06

సదస్సులో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి-భీమునిపట్నం : స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మానవ హక్కులు, సైబర్‌ నేరాలు అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పముఖ న్యాయవాది, మానవ హక్కుల విభాగం రాష్ట్ర చైర్మన్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న స్థాయిలోనే సైబర్‌ నేరాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా యువత చైతన్యం వల్లనే సైబర్‌ నేరాలను కట్టడి చేయగలమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆర్‌.మంజుల మాట్లాడుతూ, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సిహెచ్‌ జ్యోతి, డాక్టర్‌ ఎస్‌ అప్పలనాయుడు, ఐక్యుఎసి కో-ఆర్డినేటర్‌ రాజేశ్వరరావు, అధ్యాపకులు ఉమామహేశ్వరరావు, వెంకటరావు, సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.