Oct 07,2023 21:24

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   నేటి సమాజంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలకు గురి కాకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఛత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రసాద్‌ బాబు తెలిపారు. శనివారం కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కళాశాల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రసాద్‌ బాబు అధ్యక్షతన ఫ్యూచర్‌ ఛాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునిటీస్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ అంశంపై కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రసాద్‌ బాబు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు సైబర్‌ నేరాలకు లోను కాకుండా ఉంటారన్నారు. అలాగే రిసోర్స్‌ పర్సన్‌ అనీల్రా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇ-మెయిల్‌, మొబైల్‌ హకింగ్స్‌ ఏవిధంగా జరుగుతాయనే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఎం.వెంకటేశ్వరరావు, కిరణ్‌ కుమార్‌, మ్యాథమెటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సిహెచ్‌.బద్రి నారాయణ, శ్రీకాంత్‌, కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ బి.శ్రీనివాసరావు, యు.వెంకటాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.