ప్రజాశక్తి - రేపల్లె
సైబర్ నేరాల వలలోపడి ప్రజలు మోసపోతున్నారని సీఐ నజీర్ బేగ్ అన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు ఓటీపీ చెప్పకూడదని అన్నారు. సైబర్ నేరలకు గురై డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సైబర్ నేరాల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచిత వ్యక్తులకు తెలపవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని అన్నారు. సైబర్ నేరగాళ్లు చూపే అత్యాశకు ఆశపడి ఎంతోమంది లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారని చెప్పారు.










