
సైబర్ క్రైమ్ పోలీసుల పనితీరు భేష్: ఎస్‌పి
ప్రజాశక్తి -తిరుపతి సిటీ: తిరపతి సైబర్ పోలీసుల పనితీరు బాగుందని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా లో పలు విధాలుగా ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడి మోసపోతు న్నారని, పోలీస్ శాఖ కూడా పలు రకాల అవగా హన కార్యక్రమాలు చేపట్టినా అదో రకమైన మోసాలకు ప్రజలు గురవుతు న్నారన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేదంటే మోసపోతారని హెచ్చరించారు. దీనికి అడ్డు కట్ట వేయాలంటే జాగ్రత్త తప్ప మరో మార్గం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే క్రమంలో సైబర్ బాధితులు క్రైమ్ ఆఫీస్ కి వచ్చిన తరువాత జరిగిన విషయం తెలుసుకొని వారికి మొత్తం గా నగదును ఇప్పిస్తు న్నారని, గత నెలలో 10,28,229 రూపాయల నగదును వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యేందుకు సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రామచంద్ర రెడ్డి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా వుంటూ తగు చర్యలు తీసుకొని సకాలంలో బాధితులకు న్యాయం చేస్తూ అండగా నిలుస్తు న్నా మన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు పోలీసులను సంప్రదిం చాలని సూచించారు.