Oct 11,2023 00:17

సమావేశంలో మాట్లాడుతున్న పెన్షనర్ల సంఘం ప్రతినిధులు

ప్రజాశక్తి -ములగాడ : సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తున్న నేపథ్యంలో సెల్‌ ఫోన్‌ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెన్షనర్లకు మంగళవారం వెంకన్నపాలెం సిఐటియు కార్యాలయంలో అవగాహన కల్పించారు. ముందుగా పెన్షనర్ల ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దీనబంధు, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె. హుస్సేన్‌, మల్కాపురం జోన్‌ కార్యదర్శి కె.నూకరాజు హాజరై ప్రసంగించారు. హయ్యర్‌ పెన్షన్‌, 2014కు ముందు రిటైర్డ్‌ అయిన సభ్యుల విషయాలను వివరించారు. అనంతరం సైబర్‌ దోపిడీ నేపథ్యంలో సెల్‌ఫోన్‌ వినియోగంపై మణిదీప్‌ అవగాహన కల్పించారు. సెల్‌ఫోన్‌కు, బ్యాంకు ఖాతాలకు ఇతరులకు అర్థంకాని రీతిలో పాస్‌వర్డ్‌లను ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ కాల్‌ను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. సీనియర్‌ సిటిజన్‌ కార్డు అప్లికేషన్లు పూర్తి చేసి ఇస్తే కార్డులను తయారుచేసి ఇస్తానని తెలిపారు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ పెన్షనర్లు, పోర్టు పెన్షనర్లు తాతాజి, మూర్తి తదితరులు హాజరయ్యారు.