
ప్రజశక్తి - చీరాల
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా బాపట్లలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల ఆధ్వర్యంలో మండలంలోని కావూరివారిపాలెంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం మంగళవారం వన మహోత్సవంతో ఘనంగా నిర్వహించారు. చెట్లను రహదారులకు ఇరువైపులా నాటారు. క్యాంపు ముగింపు సభలో విద్యార్థులకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డాక్టర్ వై రాధా విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. మానవసేవే మాధవసేవని పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు , వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డిడి స్మిత్, ఫుడ్ సైన్స్ కాలేజ్ సీనియర్ ఉపాధ్యాయిలు డాక్టర్ సిహెచ్‌వివి సత్యనారాయణ మాట్లాడారు. సభలో చీరాల ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణారెడ్డి మాట్లాడుతూ ఇతరులకు సహాయపడడంలో ఆనందాన్ని వెదికే దిశగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంతో ఉత్సాహంతో పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ విమల బీర, డాక్టర్ బ్లేస్సి సాగర్, డాక్టర్ ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు.