
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గోదావరి జిల్లాల్లో తొలిసారి రాజమహేంద్రవరంలోని సాయి హాస్పటల్స్‌లో రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీలను ప్రారంభిం చినట్టు సాయి హాస్పటల్స్ అధినేత, ప్రముఖ ఆర్ధోపిడిక్ సర్జన్, కీళ్ల మార్పిడి సర్గరీల నిపుణుడు డాక్టర్ కురుకూరి విజరు కుమార్ చెప్పారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోబోటిక్ సర్జీరీలు చేయించుకోవాలంటే ప్రస్తుతం హైదరా బాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇక నుంచి అలాంటి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సర్జరీలను గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో సాయి హాస్పిటల్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సాధారణ మోకాలు మార్పిడి సర్జరీ కన్నా రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ వల్ల పేషంట్లకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లే రోబోటిక్ సర్జరీ చేయించుకోవటం మంచిదని సూచిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తాము చేస్తున్న సంప్రదాయ విధానంలోని మోకాలు మార్పిడి సర్జరీతో పోలిస్తే, రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ తప్పనిసరిగా మంచి ఫలితాలిస్తుందని తెలిపారు. సాధారణ మోకాలు మార్పిడి సర్జరీలో కన్నా సర్జరీలోని కోత చాలా చిన్నదిగా ఉంటుందని, నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుందన్నారు. అన్నింటికీ మించి సర్జరీని అత్యంత ఖచ్చితత్వంతో చేయగలుగుతామన్నారు. రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ అంటే రోబో మాత్రమే చేస్తుందన్న అపోహలు ఉన్నాయని, రోబో టిక్ సర్జరీ అయినా సరే తానే సర్జరీ చేస్తానని, ఆ సర్జరీలో రోబోను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ సందర్భంంగా రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రదర్శించారు. ప్రత్యేకంగా రోబోను తీసుకొచ్చి, హేండ్స్ ఆన్ కార్యక్రమంలో భాగంగా ఆర్థోపిడిక్ సర్జన్లకు వర్క్ షాపు నిర్వహించారు.