కడప అర్బన్ : ఇటీవల విడు దలైన సర్వీస్ కమిషన్ ఫలి తాలలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన కెఎల్‌ఎం మహిళా ఇంజినీరింగ్ కళా శాల పూర్వ విద్యార్థి వంకం సాయి హర్షితను కళాశాల యాజమాన్యం సోమవారం సత్కరించింది. ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ 2017-21 సంవత్సరంలో కెఎల్‌ఎం కళాశాలలో విద్యను అభ్యసించిందని పేర్కొన్నారు. పట్టుదలతో ఉద్యోగం సాధించడం పట్ల వర్షం వ్యక్తం చేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకా ంక్షించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి. రత్నమ్మ మాట్లాడుతూ మరింత కష్టపడి ఐఎఎస్ సాధించాలని పిలుపునిచ్చారు. ఇసిఇ విభాగ అధిపతి డాక్టర్ పి లక్ష్మీనా రాయణ మాట్లాడుతూ సాయి హరిత డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు జాన్ దేవానంద్ పాల్గొన్నారు.










