జాతీయ అవార్డును అందుకుంటున్న భార్గవ్‌రామ్
ప్రజాశక్తి అనందపురం: క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో విశేషంగా కృషి చేసిన మండలంలోని సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి భార్గవరామ్‌కు జాతీయఅవార్డు వరించింది. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఎయు ఎఐసిటిఇ సభ్యులు బుద్ధ చంద్రశేఖర్, ఎపి ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు హేమచంద్రరావు, ఎయు విసి ప్రసాద్‌రెడ్డి భార్గవ్‌రామ్‌కు అవార్డును అందజేశారు. అవార్డు గ్రహీత భార్గవరామ్‌ను కళాశాల కరస్పాండెంట్ వేణుగోపాల్, ప్రిన్సిపల్ ఎల్ మహేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.










