Jan 25,2022 16:32

షావోమి కొత్త ఓఎస్‌ వెర్షన్‌ ఎంఐయుఐ 13 త్వరలో అందుబాటులోకి రానుంది. తొలుత ప్రీమియం శ్రేణి మొబైల్స్‌లో ఈ ఓఎస్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. షావోమి 12, షావోమి 12 ప్రో, షావోమి 12 ఎక్స్‌, ఎంఐ 11అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 మొబైల్స్‌లో మొదట ఈ ఓఎస్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ వెర్షన్‌ ఓఎస్‌ జనవరి 26 తర్వాత మన దేశంలో మొబైల్స్‌కు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐయుఐ 13లో వచ్చే టాప్‌ 10 పీచర్లు, మార్పులను తెలుసుకుందాం.
-ఎంఐయుఐ 13 బీటా వెర్షన్‌ షావోమి కొన్ని రోజుల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం కొత్త ఓఎస్‌తో వచ్చే మొబైల్స్‌లో విజువల్స్‌ , ప్రైవసీ పరంగా భారీ మార్పులే చేసింది.
- సూపర్‌ న్యూ లైవ్‌పేవర్సు, నోట్స్‌, క్లాక్‌, మిని గేమ్స్‌కు సంబంధించి డైనమిక్‌ హోం స్క్రీన్‌ విడ్జెట్స్‌. థీమ్స్‌తో కొత్త ఓఎస్‌ కలర్‌ఫుల్‌ రానుంది.
-సౌక్యవంతమైన పఠనానికి సంబంధించి ఎంఐయుఐ 13లో మిసాన్స్‌ అనే కొత్త ఫాంట్‌ తీసుకురానున్నారు. నైట్‌మోడ్‌లోనూ ఈ ఫాంట్‌ సౌకర్యవంతగా ఉంటుందట.
-'ఘూట్‌ఆఫ ఆప్షన్‌ ద్వారా స్కీన్‌ లాక్‌ పడినా .. వీడియోలు రికార్డు వీలు కలుగుతోంది. కెమెరా ఆన్‌ చేసిన తర్వాత మూడు నిమిషాలకు స్క్రీన్‌ దానంతట అదే ఆఫ్‌ అవుతుంది.
-గ్యాలరీ యాఫ్‌లో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.ఫొటోలను చూసేందుకు ఆల్‌ కెమెరా వంటి అదనపు ఆప్షన్స్‌ రానున్నాయి. పాత ఫొటోలు చూసుకునేందుకు ఈజీ అవుతుంది.
-ప్రైవసీకి సంబంధించి ఫేస్‌ వెరిఫికేషన్‌ ప్రొటెక్షన్‌ డాక్యుమెంట్‌ వాటర్‌ మార్కింగ్‌, టెలీ కమ్యూనికేషన్‌ ప్రాడ్‌ ప్రొటెఓన్‌ వంటి ఫీచర్లు అందుబాటులోకి రనున్నాయి.
-స్పామ్‌ కాల్స్‌ విషయంలో ఈ ఓఎస్‌లో మార్పులు చేస్తున్నారట. హానికరమైన అప్లికేషన్లు, ఫైల్స్‌ బదిలీలకు తావులేకుండా ప్రైవసీ సెట్టింగ్సు మార్పులు చేశారు
-సెట్టింగ్స్‌లో బ్యాటరీ సేవింగ్‌, బ్యాలెన్స్‌, ఫెర్ఫార్మెన్స్‌ పీచర్లు తీసుకొస్తున్నారు. అలాగే ఫైల్స్‌ ఎన్‌స్క్రిప్షన్‌ , వన్‌ హండ్‌ మోడ్‌ కూడా ఉన్నాయి.
-స్మార్ట్‌ పరికరాల కనెక్టివిటీ కోసం కొత్త యాప్‌ తీసుకొస్తున్నారు. ఎంఐ స్మార్ట్‌ హబ్‌ ద్వారా వాటితో ఈ జీగా కనెక్ట్‌ అయ్యే అవకాశం రానుంది.
-ఎప్పుడు ఏమి తినాలి, నీళ్లు తాగమని చెప్పే రిమైండర్లు ఎంఐయుఐ 13లో తీసుకొస్తున్నారు. ఇకపై ఆ సేవల కోసం కొత్త యాప్‌లు అక్కర్లేదు.