Jan 06,2023 23:46

వినతిపత్రం అందజేస్తున్న స్టీల్‌ సిఐటియు నేతలు

స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యాన ధర్నా, వినతి
ప్రజాశక్తి-ఉక్కునగరం
: స్టీల్‌ ప్లాంట్‌ ఎఫ్‌ఎండి విభాగంలో శాశ్వత ఒసిఎం నియామకం చేయాలని స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఎండి విభాగంలో స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, విభాగాధిపతికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ ధర్నా నుద్దేశించి స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎఫ్‌ఎండి విభాగంలో శాశ్వత ప్రాతిపదికన ఒసిఎం నియామకాలు జరుపుకుండా, కాంట్రాక్ట్‌ విధానం ద్వారా నియామకం చేయాలని గతేడాది డిసెంబర్‌ 7న యాజమాన్యం టెండర్‌ పిలిచిందని, దీన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో నియామకం జరిపితే ప్రాణ నష్టంతో పాటు, ఆస్తి నష్టానికి ఆస్కారం ఉంటుందని, ఇటువంటి చర్యలకు యాజమాన్యం పూనుకోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్‌, గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్‌, విభాగం సిఐటియు ప్రతినిధులు ఎన్‌ఎస్‌ఎఎస్‌ నాయుడు, సిహెచ్‌ వెంకటరావు, పిజికె రాజు,డి నూకరాజు, ఎజెఆర్‌ శేషు, పి శ్రీనివాస్‌, నాగభూషణం, శ్యామలరావు, వి నారాయణమూర్తి, వి.రామారావు, స్టీల్‌ సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు, గంగాధర్‌, నీలకంఠం, కె సత్యనారాయణ, శ్రీనివాసులు రెడ్డి తదితరులతోపాటు విభాగం కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.