
నృత్య ప్రదర్శనలిస్తున్న చిన్నారులు
ప్రజాశక్తి- పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో సిద్ధేంద్రయోగి నాట్యాలయంచే శాస్త్రీయ, జానపద నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా గణపతిం మనసా స్మరామి, భావంలోన బాహ్యం నందున, గోపికమ్మా చాలు నీ నిదుర, మధుర పూరి మధు వధన, హర హర మహాదేవ, మొక్క జొన్న తోటలో, వొదినకు ఒకసారి, గాజుల సవ్వడి, కోయిలారే తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సిహెచ్ మోహనలక్ష్మి నృత్య దర్శకత్వం వహించగా రిషిత, హర్షిత, శ్రావణి, విజయ లక్ష్మి, ప్రియాంక, శాన్వి, కీర్తి, యశస్విని, దామిని, యోషిత, నవ్య, సౌజన్య, స్రవంతి, సంధ్య, మౌనిక, రఘువ కళాకారులు నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.