Sep 04,2023 23:20

ప్రజాశక్తి-కాకినాడ శాస్త్రీయ అవగాహన, మూఢనమ్మకాలు పారదోలడమే కాకుండా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు సూచించారు. జన విజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా 17వ మహాసభ సోమవారం ఐడియల్‌ కాలేజీలో జెవివి జిల్లా అధ్యక్షుడు కెఎంఎం.ఆర్‌ ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక సమాజంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తోందన్నారు. రాజ్యాంగంలో నిర్ధేశించిన అంశాలపై అవగాహన కల్పించాలని, ప్రతి కార్యకర్తా దీనిపై స్పందించాలని సూచించారు. ప్రముఖ రేడియో అంకాలజిస్ట్‌, మెడికోవర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ గుండె జబ్బుల తర్వాత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి కాన్సర్‌ అని చెప్పారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలపై అవగాహన కలిగించారు. సత్య స్కాన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కాదా వెంకటరమణ తెలుసుకుందామా మన ప్రపంచాన్ని అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ పాటర్న్‌ డాక్టర్‌ సిహెచ్‌.రవికుమార్‌ జన విజ్ఞాన వేదిక ఆశయాలను లక్ష్యాలను వివరించారు. అనంతరం కె.త్రిమూర్తులు రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నికున్నారు. గౌరవ అధ్యక్షునిగా పి.చిరంజీవినీకుమారి, డాక్టర్‌ కాదా వెంకటరమణ, వి.సత్యనారాయణ రెడ్డి, మేకా సుబ్బారావు, అనంతరావు, జిల్లా అధ్యక్షునిగా కెఎంఆర్‌ ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీరామారావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ వర్మ, ఇఆర్‌.సుబ్రహ్మణ్యం, ఖాజామొహిద్దీన్‌, ఆలపాటి శ్రీనివాస్‌, బివివి సత్యనారాయణ, మల్లికార్జునరావు, పి.బాలాజీ, సమతా కన్వీనర్‌ మంగతాయారు, ఎన్‌వి.పద్మావతి, ఎన్‌.సూర్యనారాయణ, వై.నానిబాబు, ఈశ్వరరావు, యుఎస్‌ఎన్‌.రెడ్డి, ఎం.శ్రీను పాల్గొన్నారు.