ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : జగనన్న సచివాలయ కమిటీ కన్వీనర్ తలమంచి సురేంద్రబాబు బుధవారం వైసీపీ గహసారదులు, వాలంటీర్లు, కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తోటపల్లిగూడూరు మండలం లోని మాచర్లవారిపాళెం, మల్లికార్జునపురం, మాచర్లవారిపాళెం సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సురేంద్ర బాబు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా వుండాలని సూచించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుతంత్రాల విషయంలో అప్రమత్తంగా, ఉండాలని అయన హెచ్చరించారు. వాలంటీర్లు, గ్రుహసారదులు ఇంటింటికీ వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న జగనన్న సంక్షేమ పథకాలు, సర్వేపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చేస్తున్న అభివద్ధి గురించి ప్రజలకు వివరించి చెప్పాలని సురేంద్ర బాబు చెప్పారు. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి గోవర్ధన్ రెడ్డిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అయన సూచించారు. సమావేశంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గహసారదులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










